30 July, 2026 | 8:42 PM

విద్యుత్ ప్రమాదాల నివారణే లక్ష్యం

30-07-2026 07:38 PM

ముకరంపుర,(విజయక్రాంతి): వర్షాకాలం నేపథ్యంలో ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు తలెత్తకుండా 50వ డివిజన్ కార్పొరేటర్ బోయిన్‌పల్లి ప్రవీణ్ రావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. డివిజన్‌లోని పలు ప్రాంతాలలో విద్యుత్ తీగలు, స్తంభాలకు ప్రమాదకరంగా మారిన చెట్లను, కొమ్మలను తొలగించే  కార్యక్రమాన్ని ప్రవీణ్ రావు చేపట్టారు. ఈ పనులను స్వయంగా పరిశీలించి, మున్సిపల్ సిబ్బంది కి తగిన సూచనలు అందించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ బోయిన్‌పల్లి ప్రవీణ్ రావు మాట్లాడుతూ... ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా విద్యుత్ తీగలపై చెట్ల కొమ్మలు పడి షార్ట్ సర్క్యూట్లు జరిగే ప్రమాదం ఉన్న ప్రాంతాలను డివిజన్లో గుర్తించడం జరిగింది.

ముఖ్యంగా విద్యుత్ వల్ల డివిజన్ ప్రజలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. డివిజన్‌లోని పలు ప్రాంతాలలో విద్యుత్ శాఖ అధికారుల సమన్వయంతో ప్రమాదకర చెట్ల కొమ్మలను తొలగించినట్లు చెప్పారు.డివిజన్‌లో విద్యుత్ సరఫరాకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నా, లేదా ప్రమాదకరంగా మారిన చెట్లు ఎక్కడైనా ఉన్నా వెంటనే  తన దృష్టికి తీసుకురావాలనీ,  ప్రజల సౌకర్యార్థం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని  బోయిన్పల్లి ప్రవీణ్ రావు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్, విద్యుత్ శాఖ సిబ్బంది, స్థానిక  బిజెపి నాయకులు  డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.