సిర్గాపూర్ రోడ్డుపై వరి నాటు వేస్తున్న యువకులు
సిర్గాపూర్(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలో రోడ్ల దుస్థిపై యువకులు వినూత్నంగా వరి నాటు వేశారు. సిర్గాపూర్ మండల కేంద్రంలో రోడ్లపై గుంతలు ఏర్పడి బురద కరంగా మారి రహదారులు ఇబ్బంది కరంగా మారి ప్రమాదాలు జరుగుతున్న అధికారులు ఎలాంటి స్పందన లేదు. మొత్తం రోడ్డు ఆధ్వణంగా మారి వరి నాటు మడిగా మారడంతో వరి నాటు వేస్తున్నామని యువకులు అన్నారు. వాహనాలకు రాక పోకలకు చాలా ఇబ్బంది కరంగా ఉందన్నారు.
ఖేడ్ నుండి సిర్గాపూర్ మీదుగా మాసన్ పల్లి వరకు రోడ్డు సాంక్షన్ ఐ 2 సంవత్సరాలు ఐనప్పటికీ ఇంత వరకు నిర్మాణ పనులు జరగ పొగ ఎక్కడి గొంగడి అక్కడే ఉందన్నా మాదిరిగా అధికారులు వ్యవహారిస్తున్నారని మండి పడ్డారు. ఖేడ్ వెళ్లాలన్న చుట్టూ ప్రక్కల గ్రామాల నుండి రోజు కొన్ని వేల సంఖ్యలో వాహనాలు రాక పోకలు సాగిస్తుంటారని యువకులు ఆగ్రహం వెక్తం చేశారు. ఇప్పటి కైనా అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ పనులు మొదలు పెట్టాలని కోరారు.






