శిథిలావస్థలో ఉన్న ఇండ్ల లబ్ధిదారులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి
30-07-2026 08:24 PM
ఎంపీవో ప్రకాష్
చేగుంట: చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని స్థానిక సర్పంచ్, పంచాయతీ కార్యదర్శితో కలిసి ఎంపీవో ప్రకాష్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షాల నేపథ్యంలో గ్రామ పరిధిలో శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా ఉన్న ఇళ్లను తక్షణమే గుర్తించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా, శిథిల గృహాల్లో నివాసముంటున్న వారిని గుర్తించి గ్రామ పంచాయతీలోని, ప్రభుత్వ భవనాల్లో సురక్షిత ఆశ్రయం కల్పించాలని సూచించారు. వర్షాల వేళ ప్రజల ప్రాణరక్షణే ధ్యేయంగా గ్రామ స్థాయిలో అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ, అప్రమత్తంగా ఉండాలని అన్నారు.






