30 July, 2026 | 9:44 PM

ప్రభుత్వ పాఠశాలలోకి వరద నీరు

30-07-2026 08:35 PM

రామగిరి,(విజయక్రాంతి): రామగిరి మండలం రత్నాపూర్ ప్రభుత్వ పాఠశాలలోకి బుధవారం వరద నీరు భారీగా వచ్చింది. భారీగా వర్షం కురియడంతో పక్కనే ఉన్న నాలా పొంగిపొర్లింది. దీంతో నాలా నిండిపోయి పాఠశాలలోకి వరద నీరు ప్రవహించింది. సెంటినరీ కాలనీ, రామ్ నగర్ లధ్నాపూర్ పాత, కొత్త ప్లాట్స్ లలో నుండి రామగిరి ఖిల్లా నుండి వచ్చే వరద నీరు ఈ నాలా గుండా ప్రవహించడంతో ఈ దుస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్పల్లె ప్రతిమ పీవీరావు, సెక్రటరీ గంగుల సంతోష్ పాఠశాలకు చేరుకొని అక్కడ స్థితిగతులను పరిశీలించారు. భారీగా వరద నీరు చేయడంతో విద్యార్థులకు సెలవు ప్రకటించడం జరిగింది.