30 July, 2026 | 9:25 PM

Breaking News

బోధన్ సీనియర్ ఫోటో & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం   •   ఎస్సారెస్పీలోకి భారీ వరద   •   కాళేశ్వరం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి   •   సంగెం నగేష్ రెడ్డి దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం, ఆగ్రోస్ చైర్మన్ కాసుల   •   సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •   అమెరికాలో ఉన్నా ఆలోచన కల్లూరు అభివృద్ధిపైనే   •   సలబత్‌పూర్ చెక్‌పోస్ట్ ఘటనపై ప్రాథమిక విచారణకు ఆదేశాలు   •   మాల్తుమ్మెదలో బేటి బచావో బేటి పడావో కార్యక్రమంపై అవగాహన   •   భారీ వర్షానికి ఇల్లు కూలిన ఘటన..   •   భారీ వర్షాల నేపథ్యంలో కల్వర్టు, వంతెనను పరిశీలించిన ఐటీడీఏ పిఓ   •  

వర్షాలపై ప్రత్యేక దృష్టి వార్డుల్లో కమిషనర్ పర్యటన

30-07-2026 08:16 PM

నర్సాపూర్: భారీ వర్షాల నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ చెరుకు సాయికుమార్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిలిచిన వరద నీటిని తొలగించే పనులను పరిశీలించారు. అనంతరం వార్డుల్లో పర్యటించి శిథిలావస్థలో ఉన్న ఇళ్లను తనిఖీ చేశారు. ప్రమాదకర ఇళ్లలో నివసిస్తున్న వారు అవసరమైతే మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని, ప్రజలు విద్యుత్ స్తంభాలు, నీటి కుంటలు, శిథిల గోడల సమీపానికి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు.