చికిత్స పొందుతున్న యువకుడి మృతి
- వైద్యం వికటించడం వల్లే మరణించినట్లు బంధువుల ఆందోళన
- సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘటన
సూర్యాపేట, మే 11 (విజయక్రాంతి) : ఛాతిలో నొప్పి అని ప్రైవేట్ దవాఖాన కు చికిత్స కోసం వెళ్లిన యువకుడు మృ తి చెందిన ఘటన సోమవారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల మేరకు జాజిరెడ్డిగూడెం మండలంలోని ఆర్వపల్లి గ్రామానికి చెందిన సాయిని శ్రీకాంత్ (23) సోమవారం ఉదయం ఛాతిలో నొ ప్పి వస్తుందని జిల్లా కేంద్రంలోని రోహి ణి దవాఖానకు వెళ్లాడు.
దీంతో ఆస్పత్రి సిబ్బంది అతనికి పరీక్షలు నిర్వహించి వైద్యాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం ఒక్కసారిగా యాజమాన్యమే అంబులెన్స్‌లో శ్రీకాంత్‌ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ సిబ్బంది శ్రీకాంత్‌ను పరీక్షించగాఅప్పటికే మృతి చెంది నట్లు తెలిపారన్నారు.
కాగా వైద్యం వికటించడం వల్లే శ్రీకాంత్ చనిపోయాడని, యాజమాన్యంపై చర్య లు తీసుకోవాలని మృతుడి బంధువులు ఆందోళన నిర్వహించారు. పోలీసులు పరిస్థితిని అదు పు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.






