12 May, 2026 | 1:22 AM

కొనుగోలు కేంద్రాలను సందర్శించిన సిపిఎం జిల్లా బృందం

12-05-2026 12:26 AM
  1. తరుగు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
  2. సీపీఎం మేడ్చల్ జిల్లా కార్యదర్శి:పి సత్యం

మేడ్చల్ అర్బన్ మే 11(విజయక్రాంతి):రైతులు పండించిన ధాన్యాన్ని ఎలాంటి కరువు లేకుండా వ్యవసాయ మార్కెట్ యార్డులలో వెంటనే కొనుగోలు చేయడంతో పాటు కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మేడ్చల్ జిల్లా సిపిఎం కార్యదర్శి పి సత్యం పేర్కొన్నారు.సోమవారం మేడ్చల్,పూడూరు మార్కెట్ యార్డులలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలను సిపిఎం బృందం ఆధ్వర్యంలో సందర్శించినట్లు తెలిపారు.

జిల్లాలోని మార్కెట్ యార్డులు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలలో ఆలస్యం తరుగు పేరుతో కోతలు తేమ శాతం అంటూ రైతులను ఇబ్బందులు పెడుతూ బ్యాగుల కొరత రైతులను తీవ్రంగా నష్ట పరుస్తున్నాయని సత్యం ఆరోపించారు.అంతే కాకుండా కొన్ని కేంద్రాలలో రైతులు రోజుల తరబడి దాన్యంతో వేచి ఉండాల్సి వస్తోందని వర్షాల కారణంగా పంట నష్టపోతున్న పరిస్థితులు ఉన్నాయని ఆయన వెల్లడించారు.

కొనుగోలు కేంద్రాలలో త్రాగునీరు,టెంట్ లు,కూర్చునే సౌకర్యం,మరుగు దొడ్లు,రాత్రి భద్రత,పారదర్శక తూకం వ్యవస్థ వంటి మౌలిక వసతులు కల్పించాలని సత్యం డిమాండ్ చేశారు.మధ్యవర్తుల దోపిడి అరికట్టడం ప్రతి కొనుగోలు కేంద్రంపై అధికారుల పర్యవేక్షణ పెంచి ప్రత్యేక సమీక్ష చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చంద్రశేఖర్ జిల్లా కమిటీ సభ్యులు నరేష్.ఎన్ శ్రీనివాస్.నర్సింగ్ రావు.కొమురయ్య.వెంకటేష్.సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎర్ర అశోక్ నాయకులు శ్రీనివాస్.పరుశరాం.భూక్య తదితరులు పాల్గొన్నారు.