25 April, 2026 | 6:26 PM

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి... కుటుంబానికి న్యాయం చేయాలి

25-04-2026 04:49 PM

కారు తో ఢీకొట్టిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలి

మృతుని బందువు మబ్బు తిరుపతి

మంథని,(విజయక్రాంతి): రామగిరి మండలంలోని బేగంపేట గ్రామంలో ఈనెల 20వ తేదీ రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలని, కారుతో ఢీకొట్టిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుని బందువు మేనమామ మబ్బు తిరుపతి అధికారులను శనివారం ఒక ప్రకటనలో కోరారు.  ముత్తారం మండలం మైదంబండ గ్రామ పంచాయతీ లోని సర్వారం గ్రామానికి చెందిన పెయ్యల సాయి (23) ఓసిపి-2 లో ప్రైవేట్ ఉద్యోగం చేసుకొని జీవిస్తున్నాడని, అతను ఈనెల 20వ తేదీ రాత్రి ఓసిపి-2 లో ఉద్యోగానికి వెళుతుండగా రామగిరి మండలం బేగంపేట గ్రామంలో ముత్తారం గ్రామానికి చెందిన కారు ఢీ కొట్టి వెళ్లిపోయిందని, ఈ ప్రమాదంలో సాయి అక్కడికక్కడే మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. కారు తో ఢీ కొట్టి యువకుడి మృతికి కారకులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని, పేద కుటుంబమైన సాయి తల్లిదండ్రులను ఆదుకోవాలని తిరుపతి తెలిపారు. లేనియెడల కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తిరుపతి తో పాటు బంధువులు ఆకుల ఓదెలు, పిడుగు రవి, సాదుల వినయ్, ఊదరి శివ శంకర్, పందుల అజయ్ హెచ్చరించారు.