8 May, 2026 | 12:57 PM

వేసవి శిబిరం సద్వినియోగం చేసుకోగలరు: ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి

08-05-2026 12:06 PM

దేవరకొండ,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం సమ్మర్ క్యాంప్ ను డిండి మండలంలోని  స్థానిక పిఎం శ్రీ మోడల్ స్కూల్ లో వేసవి శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డి.నారాయణరెడ్డి పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమ్మర్ క్యాంప్ లో భాగంగా విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ,డాన్స్, సంగీతం, పాటలు నేర్పించడం మరియు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆటలు నేర్పించడం మరియు క్రియేటివ్ యాక్టివిటీస్, చిత్రలేఖనం, అవుట్డోర్ గేమ్స్ అండ్ ఇండోర్ గేమ్స్ నేర్పించబడును. 

ఈ సమ్మర్ క్యాంపు కార్యక్రమం మే 11 నుండి మే 25 వరకు నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంప్రిన్సిపల్,ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్  తెలిపారు. ఇట్టి సమ్మర్ క్యాంపులో మండలంలోని అన్ని పాఠశాలలోనీ 6వ తరగతి నుండి 9వ విద్యార్థిని విద్యార్థులు పాల్గొనవలసిందిగా తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థినీ విద్యార్థులు మే 9 2026 శనివారంలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా తెలిపారు  మరిన్ని వివరాలకు పాఠశాల ప్రిన్సిపాల్ డి.నారాయణరెడ్డి చరవాణి  9490696989 లేదా డిండి పిఎం శ్రీ ఆదర్శ పాఠశాల మరియు కళాశాల లో సంప్రదించగలరని తెలిపారు.