8 May, 2026 | 12:57 PM

కొలనూరు చెరువు వద్ద రైతు వారోత్సవాలు నిర్వహణ

08-05-2026 12:04 PM

నీటి సంరక్షణపై అవగాహన

కోనరావుపేట,(విజయక్రాంతి): ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కోనరావుపేట మండలంలోని కొలనూరు చెరువు వద్ద నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో మే 4 నుండి మే 10 వరకు నిర్వహిస్తున్న రైతు వారోత్సవ కార్యక్రమం శుక్రవారం కొనసాగింది. ఈ సందర్భంగా చెరువులోని కంప చెట్లు, గుర్రపు డెక్క తొలగింపు పనులు చేపట్టడంతో పాటు సమతుల్య నీటి వినియోగం, చెరువు సంరక్షణ, భూగర్భ జలాల పెరుగుదల వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.

నీటి పారుదల శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ డి. వినయ్ మాట్లాడుతూ నీటిని పొదుపుగా వినియోగించడం ద్వారా భవిష్యత్ తరాలకు నీటి వనరులను కాపాడవచ్చని తెలిపారు.చెరువుల పరిరక్షణ ప్రతి రైతు బాధ్యత అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కొలనూర్ గ్రామ సర్పంచ్ జలగం అరవింద్ రావు,సింగిల్ విండో చైర్మన్ సంకినేని రామ్మోహన్ రావు, పంచాయతీ కార్యదర్శి మొయిజీద్దీన్, ఉప సర్పంచ్ బాబు, పాలకవర్గ సభ్యులు ఓరగంటి శంకర్, తుమ్మల సురేష్, మత్స్య శాఖ సంఘం అధ్యక్షులు మామిండ్ల అంజయ్య, ఉపాధ్యక్షులు డి రాములు, ప్రధాన కార్యదర్శి ఎం మహేష్, సభ్యులు ఎం రవి, ఎం శ్రీనివాస్,రైతులు మెరుగు శ్రీనివాస్, వి తిరుపతి, ఎ ముత్యం రావు, పి విష్ణు, ఎస్ రాకేష్, వి పర్వతాలు తదితరులు హాజరయ్యారు.