15 March, 2026 | 3:15 AM

40 ఏళ్ల చైతన్య కళా సమాఖ్య

15-03-2026 12:08 AM

మారుమూల గ్రామీణ ప్రాంతంలో నాలుగు దశాబ్దాల క్రితం ఔత్సాహిక కళాకారులతో మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఏర్ప డ్డ చైతన్య కళా సమాఖ్య నాటక రంగ ప్రాభవం కోసం కృషి చేస్తూ, రంగస్థల సంస్కృతికి కాపరిగా నిలుస్తోంది. తొర్రూరు చైతన్య కళా సమాఖ్య ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకటిగా ప్రాముఖ్యతను పొందుతోంది. కళా అభివృద్ధి లక్ష్యంగా ఏర్పాటైన సంస్థ తెలుగు నాటక రం గానికి ప్రోత్సాహం కల్పించడం, యువతలో కళల పట్ల ఆసక్తిని పెం పొందించడం, గ్రామీణ కళాకారులకు ప్రదర్శన అవకాశాలు కల్పించడం అనే లక్ష్యాలతో చైతన్య కళా సమాఖ్య ఏర్పడింది. 

స్థానిక కళాకారులు, నాటకాభిమానులు సుమారు 50 మందికి పైగా సమాఖ్యగా ఏర్పడి నాటక రంగ ప్రాభవం కోసం కృషి చేస్తున్నారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా మన్నూరి ఉమ, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జినుగ సురేందర్‌రెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా మంగళంపల్లి శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీగా సుంకరనేని పినాకపాణి, ట్రెజరర్‌గా గడల శ్రీనివాస్‌తో పాటు దాతలు నాటక రంగ ప్రభావం కోసం కృషి చేస్తున్నారు. గత 14 సంవత్సరాలుగా సమాఖ్య ప్రాంతీయ స్థాయిలోనే కాకుండా, రాష్ట్ర, జాతీయ స్థాయి నాటక పోటీలను నిర్వహిస్తోంది. ముఖ్యంగా సామాజిక సమస్యలను ప్రతిబింబించే నాటకాలు, నాటికలు ప్రదర్శించడం ద్వారా కళ ద్వారా సమాజానికి సందేశం చేరవేయడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యంగా కొనసాగుతోంది.

నాటక పోటీలు కళాకారులకు ప్రోత్సాహం

ప్రతి సంవత్సరం చైతన్య కళా సమాఖ్య ఆధ్వర్యంలో జాతీయ స్థాయి నాటిక పోటీలు, సాంస్కృతిక వేడుకలు నిర్వహించడం ప్రత్యేకత. ఈ పోటీలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి వివిధ నాటక బృందాలు పాల్గొంటాయి. ప్రతిభ చూపిన కళాకారులకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో నాటక సంస్కృతి నేటి కాలంలో సినిమాలు, డిజిటల్ మీడియా ప్రభావం పెరుగుతున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో రంగస్థల నాటకాలకు మళ్లీ ఊపిరి పోసేలా ఈ సమాఖ్య కృషి చేస్తోంది. నాటకోత్సవాలకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు హాజరవుతారు. 

కళాకారులకు ఆశాకిరణం

చైతన్య కళా సమాఖ్య వేదికగా అనేక మంది కొత్త కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం పొందుతున్నారు. కొంతమంది కళాకారులు ఈ వేదిక నుంచే రాష్ట్ర స్థాయికి ఎదిగిన ఉదాహరణలు ఉన్నాయి. ఈ విధంగా తొర్రూరులోని చైతన్య కళా సమాఖ్య కేవలం ఒక సాంస్కృతిక సంస్థ మాత్రమే కాకుండా, తెలుగు నాటక కళకు అంకితమైన కళా ఉద్యమంగా నిలుస్తోంది. 

బండి సంపత్ కుమార్