11 March, 2026 | 9:46 AM

పర్యవేక్షణ జాడ ఏదీ?

11-03-2026 12:00 AM

ప్రభుత్వ ఆదేశాలు భే ఖాతారు

ఇంటర్ పరీక్షల సమయంలో తెరిచి ఉన్న జిరాక్స్ సెంటర్లు 

బూర్గంపాడు, మార్చి 10 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో ప్రభుత్వ ఆదేశాలను అధికారులు భే ఖాతరు చేశారు. మంగళవారం ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న సమయంలో జిరాక్స్ సెంటర్లు తెరిచి ఉంచడంపై బూర్గంపాడు మండల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల నిబంధనలను ఉల్లంఘిస్తూ కొన్ని జిరాక్స్ సెంటర్లు యథేచ్ఛగా పనిచేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. దీనివల్ల పరీక్షల పవిత్రతకు భంగం వాటిల్లుతుందని, నిబంధనలు పాటించని సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.