పంచాయతీలకు శాశ్వత భవనాలు
- ఉన్నత స్థాయికి తెలంగాణ టూరిజం
- అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో ఉపాధి కోర్సులు
- ప్రీ-బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, మార్చి 10 (విజయక్రాంతి): రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలన్నింటికి శాశ్వత భవనాలు నిర్మించాలని, ఆ మేరకు పంచాయ తీరాజ్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్రీ-బడ్జెట్ సమావేశాలు నిర్వ హించారు.
మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, గడ్డం వివేక్‌లతో కలిసి ఆయా శాఖలపై చర్చించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. స్థలా లు అందుబాటులో ఉన్నచోట తహసీల్దార్ కార్యాలయాలు, ఎంపీడీవో కార్యాలయాలు కలిపి నిర్మాణం చేపట్టే ఆలోచన చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచిం చారు.
చిన్నారుల మెదడు బలంగా ఎదిగేందుకు అవసరమైన పౌష్టిక ఆహారంతో పాటు బోధనా పద్ధతులతో వారికి తర్ఫీదు ఇవ్వాలని సూచించారు. పట్టణాల్లో రహదారులపైన కొంతమంది చంటి బిడ్డలను పెట్టుకొని యాచక వృత్తి కొనసాగిస్తున్నారని, వారందరినీ శిశు విహార్‌లో తరలించే చర్యలు చేపట్టాలని సూచించారు. శిశు విహార్‌లో మోడ్రన్ కిచెన్ నిర్మించాలని సూచించారు.
ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు
ఉపాధి కల్పించే విధంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో కోర్సులు రూపొందించా లని, గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా ఎంవో యూ కుదుర్చుకున్న కంపెనీలను సంప్రదిం చి అందుకు అనుగుణంగా ఏటీసీ సెంటర్ల లో కోర్సులు ప్రవేశపెట్టాలని డిప్యూటీ సీఎం భట్టి సూచించారు. క్యూర్, ప్యూర్ రేర్ పాలసీకి అనుగుణంగా వచ్చే పరిశ్రమలను దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో కోర్సులు ప్రవేశపెట్టాలి, స్కిల్ యూనివర్సిటీతో అనుసంధానం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో ఇసుక మై నింగ్ ట్రైబల్ ఏజెన్సీల ద్వారా మాత్రమే జరగాలని, ఈ క్రమంలో ఏజెన్సీలకు ఐటీడీఏల నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేసి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఆదేశించారు. పర్యాటక రంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని డిప్యూటీ సీఎం సంబంధిత అధికారులకు సూచించారు. కవ్వాల్, శ్రీశైలం వంటి టైగర్ జోన్లు అభివృద్ధి చేసుకోవాలని పర్యాటకులను ఆకర్షిం చే విధంగా ఎకో, టెంపుల్ టూరిజం ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించా రు.
ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించేందుకు యువతను చైతన్యం చేయాలని, డ్రగ్స్ వినియోగం ద్వారా జరిగే నష్టాన్ని కళ్లకు కట్టినట్టు చూపించే విధంగా గ్రామస్థాయిలో కళారూపాలు ప్రదర్శించేలా సాంస్కృతిక శాఖ చర్యలు చేపట్టాలని సూచించారు.
సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సిఎస్ సంజయ్ కుమార్, మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, సీసీఎల్‌ఏ సెక్రటరీ లోకేష్ కుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ అనిత రామచంద్రన్, దివ్య దేవరాజ్, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక, గృహ నిర్మాణ శాఖ సెక్రటరీ గౌతం , డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు.
భూముల రీ సర్వే కోసం ఆధునిక రోవర్లు: మంత్రి పొంగులేటి
రాష్ట్రంలో భూ లావాదేవీలను మరింత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, రైతులకు అత్యుత్తమ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. భూ సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని నివారించడానికి రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ఒకే గొడుగు కిందికి తీసుకొస్తున్నామని చెప్పారు. దీని కోసం ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు.
పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, అత్యాధునిక ’రోవర్’ పరికరాలతో భూముల సర్వే నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇప్పటికే మండలానికి ఒకటి చొప్పున 460 రోవర్లను కొనుగోలు చేశామన్నారు. వచ్చే బడ్జెట్‌లో మరో 400 రోవర్ల కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని వెల్లడించారు.
రాష్ట్రంలో నక్షా (మ్యాప్) లేని 373 గ్రామాల్లో త్వరలోనే రీ-సర్వే చేపట్టబోతున్నామని, ఇందుకు సంబంధించి 2026- 27 బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని డిప్యూటీ సీఎం భట్టిని మంత్రి పొంగులేటి కోరారు. ప్రస్తుతం అద్దె భవనాల్లో కొనసాగుతున్న ఆర్డీవో, తహసీల్దార్ కార్యాల యాలకు శాశ్వత ప్రభుత్వ భవనాలను నిర్మించనున్నట్లు తెలిపారు.




