11 March, 2026 | 8:16 AM

కేజీ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ‘ఇకార్యస్’ అండ్ ‘ఇన్విక్టా’

11-03-2026 12:00 AM

అట్టహాసంగా ఈ నెల 13 వరకు వార్షికోత్సవాలు నిర్వహణ

మొయినాబాద్, మార్చి 10 (విజయక్రాం తి): కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (కేజీఆర్‌సీఈటీ) ప్రాంగణం మంగళవారం సందడితో నిండిపోయింది. విద్యార్థి వ్యవహారాల విభాగం (డీఎస్‌ఏ) ఆధ్వర్యంలో ‘ఇకార్యస్’,‘ఇన్విక్టా’2026 వార్షికోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం నుంచి ఈనెల 13 వరకు నాలుగు రోజు ల పాటు జరగనున్న ఈ వేడుకలు, సాంకేతిక నైపుణ్యాలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమా ల సమ్మేళనంగా సాగనున్నాయి.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కళాశాల యాజమా న్యం, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్య లో హాజరయ్యారు. ముఖ్య అతిథిగా జేఎన్‌టీయూహెచ్ ఉపకులపతి డాక్టర్ టి.కిషన్ కుమా ర్‌రెడ్డి, గౌరవ అతిథిగా కేజీఆర్‌సీఈటీ చైర్మన్ ఎల్‌ఎన్‌కే కృష్ణారెడ్డి హాజరయ్యారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సాయి సత్యనారాయణరెడ్డి, హెడ్‌ఆఫ్ డీఎస్‌ఏ ఎం.రత్నాచారి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమై న కార్యక్రమంలో ముఖ్య అతిథి డాక్టర్. టి.కిషన్‌కుమార్ రెడి మాట్లాడుతూ సాంకేతిక, క్రీడా ఉత్సవాలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఎం తగానో దోహదపడతాయన్నారు. చైర్మన్ అం డ్ ప్రిన్సిపాల్ ఎల్‌ఎన్‌కే కృష్ణారెడ్డి, డాక్టర్ సాయి సత్యనారాయణ రెడ్డిలు తమ సందేశా ల్లో  విద్యార్థుల చొరవను అభినందించారు.

సమగ్ర విద్యకు ఇటువంటి కార్యక్రమాలు పునాదులని పేర్కొన్నారు. డీఎస్‌ఏ హెడ్ ఎం. రత్నచారి మాట్లాడుతూ, విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసేలా  మేధస్సుకు పదును పెట్టేలా ఈ నాలుగు రోజులు అనేక కార్యక్రమాలను రూపొందించామని తెలిపారు.