పార్కుల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్
అంగన్‌వాడీల్లో పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందాల్సిందే: ఆర్‌వీ కర్ణన్
అంబేద్కర్ నగర్ పేదలకు ఇందిరమ్మ ఇళ్ల భరోసా: కలెక్టర్ హరిచందన
హైదరాబాద్ సిటీ బ్యూరో/సికిందరాబాద్, మార్చి 10 (విజయక్రాంతి): నగరం లోని ఐడీహెచ్ డబుల్ బెడ్రూం ఇళ్ల కాలనీ వాసులకు త్వరలో ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి రానుంది. కాలనీలో ని చిన్నారుల కోసం ప్రత్యేకంగా పార్కులను అభివృద్ధి చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ అధికారులను ఆదేశిం చారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్ర మంలో భాగంగా మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, హౌసింగ్ ఎండీ గౌతమ్‌తో కలిసి సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో విస్తృతం గా పర్యటించారు. కాలనీల రూపురేఖలు మార్చడంతో పాటు, పేదలకు ప్రభు త్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధి కారులకు దిశానిర్దేశం చేశారు.
బన్సీలాల్‌పేట్ డివిజన్ పరిధిలోని ఐడీహెచ్ కాలనీని సందర్శించిన కమిషనర్, అక్కడ నివసిస్తున్న ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో ఉన్న రెండు ఖాళీ స్థలాలను పరిశీలించిన ఆయన, వాటిని వెంటనే చిన్నారుల కోసం పార్కులుగా తీర్చిదిద్దాలని సికిందరాబాద్ జోనల్ అధికారు లను ఆదేశించారు.
మారేడుపల్లి అంబేద్కర్ నగర్ కాలనీలో పర్యటించిన జిల్లా కలెక్టర్ హరిచందన, కమిషనర్‌తో కలిసి పేదల ఇళ్లను పరిశీలించారు. పర్యటనలో జీహెచ్‌ఎంసీ సికిందరాదాబాద్ జోనల్ కమిషనర్ మంగతాయారు, కవాడిగూడ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఆర్. పుష్పలత, ఆర్డీవో సాయిరాం, తహసీల్దార్ పాండు నాయక్ తదితరులు పాల్గొన్నారు.




