2028లో కూటమిదే అధికారం
తెలంగాణ రాజకీయ కూటమి నేతలు
హైదరాబాద్, మార్చి 10 (విజయక్రాంతి): తెలంగాణ రాజకీయ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు ఇప్పటి నుంచే కష్టపడి పనిచేస్తే 2028లో అధికారం సాధిం చవచ్చునని కూటమి అధ్యక్షుడు ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్, సెక్రటరీ జనరల్, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, కన్వీనర్లు డాక్టర్ ఈడా శేషగిరిరావు, రామావత్ లాలు నాయక్, డేవిడ్ ఆంధ్య్రూ పిలుపునిచ్చారు.
మంగళవారం రాస్ట్రీయ లోక్ దళ్ పార్టీ కార్యాలయంలో జరిగిన రాజకీయ శిక్షణా తరగతుల్లో వారు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అవినీతిబంధు, కుటుంబ ప్రీతీ రాజకీయాలకే పరిమితమై ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. తమ పది గ్యారంటీలతో తెలంగాణ పేద ప్రజల బ్రతుకులు మారుతాయని హామీ ఇచ్చారు.
కూట మి జాతీయ అధికార ప్రతినిధి, హైకోర్టు అడ్వకేట్ ఎస్ శరత్‌కుమార్ మాట్లాడు తూ.. కేసీఆర్ కంటే రేవంత్‌రెడ్డి పది రెట్లు దోపిడీదారుదని, ఇలాంటి తెలంగాణ ద్రోహుల నుంచి తెలంగాణ సమాజా న్ని కాపాడానికి తాను నిజాయితీ పరులు విద్యావం తులైన తెలంగాణ రాజకీయ కూటమి నేతలను బలపరుస్తున్నానని చెప్పారు.
సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ విట్టల్ మాట్లాడుతూ.. నాయకుడంటే నలుగురికి ఆధార్శంగా ఉండాలి ప్రజలను ప్రేమించాలి కెసిఆర్ రేవంత్ రెడ్డి తెలంగాణ దోపిడీ దారులని అవినీతి తిమింగి లాలని మండిపడ్డారు. వారి నుండి తెలంగాణ ప్రజలను విముక్తి చేయాలంటే తెలం గాణ రాజకీయ కూటమి లాంటి ప్రత్యామ్నా యం కావలన్నారు. మొదటి విడత శిక్షణలో 70 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.




