మాగి గ్రామంలో ఘనంగా కుస్తీ పోటీల నిర్వహణ
26-05-2026 12:31 AM
నిజాంసాగర్ మే 25( విజయ క్రాంతి ) కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని మాగీ గ్రామంలో ముత్యాల పోచమ్మ,ఎల్లమ్మ ఉత్సవాల్లో భాగంగా . గ్రామ సర్పంచ్ గుర్రపు సుమిత్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో కుస్తీ పొడిలో ఘనంగా నిర్వహించారు. మల్లయోధులకు వంద రూపాయల నుండి 5000 రూపాయల వరకు నగదు బహుమతులను అందించారు.
పిట్లం, కంగ్టి, నారాయణకేడ్, కర్ణాటక, మహారాష్ట్ర నుండి వచ్చిన మల్లయోధులు ఈ కుస్తీ పోటీ లో పాల్గొన్నారు. కార్యక్రమంలో పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, మెంగారం శ్రీనివాస్, పండరి, బాలసాయిలు తదితరులు పాల్గొన్నారు.






