ఇళ్లు కట్టకపోతే పోటీ చేయను
- గత ప్రభుత్వం కంటే ఎక్కువ నిర్మిస్తాం
- సవాల్‌ను స్వీకరించేందుకు కేటీఆర్ సిద్ధమేనా?
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి) : గ్రేటర్ హెదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో బీఆర్‌ఎస్ కంటే ఎక్కువ ఇళ్లు నిర్మిస్తామని, లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎక్కువ ఇళ్లు నిర్మిస్తే పోటీ చేయకుండా ఉండేందుకు మీరు సిద్ధమేనా? అని కేటీఆర్‌కు సవాల్ విసిరారు. బుధవారం సచివాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజహరుద్దీన్‌తో కలిసి మీడి యాతో మాట్లాడారు.
అవుటర్ రింగ్ రోడ్డు పరిధిలోని క్యూర్ ఏరియాలో తొలి విడతలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి త్వర లో సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఇళ్ల నిర్మాణానికి స్థల పరిశీలన జరుగుతుందని, ఇప్పటి వరకు 40 చోట్ల భూములను గుర్తించినట్లు మంత్రి వెల్లడించారు. లబ్ధిదారులపై పైసా భారం పడకుం డా.. ఈ ఇళ్లను ఆడబిడ్డల పేరిట ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తుందన్నారు. కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను సైతం పేదల గృహ నిర్మాణం కోసం వినియోగిస్తామని తెలిపారు.
తమ ప్రభు త్వం తొలి విడతగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు, గిరిజన ప్రాంతాలకు 5 వేల వరకు ఇళ్లు మంజూరు చేసిందని గుర్తు చేశా రు. రెండో విడతలో మరో 2 వేల ఇళ్లు చొ ప్పున మంజూరు చేస్తామని వెల్లడించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 45 నుంచి 46 వేల వరకు ఇళ్ల నిర్మాణం చేపట్టి, అందులో 20 వేలకు పైగా గృహాలను అసంపూర్తిగా వదిలేసిందన్నారు. నిర్మించిన వాటిలో కూ డా 16 వేల పైచిలుకు ఇళ్లలో లబ్ధిదారు లు నివసించలేని పరిస్థితులు ఉన్నాయన్నారు.
చాలా చోట్ల మౌలిక వసతులు కూడా లేవ ని, కొల్లూరు ప్రాంతంలో వర్షాలకు ఇళ్లు కారిపోతున్నాయని, ఆ సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పారు. ఉమ్మ డి రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా ల్లో జీ ప్లస్ టూ విధానంలో నిర్మించిన ఇళ్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయని, అప్పట్లో జిల్లా కలెక్టర్లు నివేదికలు ఇచ్చినా బీఆర్‌ఎస్ సర్కార్ పట్టించుకోలేదన్నారు.
తమ ప్రభు త్వం వాటి స్థానంలో కొత్త ఇళ్లు నిర్మించి పేదలకు గౌరవప్రదమైన జీవనం అందిస్తుందని మంత్రి పేర్కొన్నారు. నిరుపయోగంగా ఉన్న షాపులను బహిరంగ వేలంలో విక్రయించి, వచ్చిన నిధులను భవనాల నిర్వహణ కమిటీల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణ యించినట్లు తెలిపారు.
నగరంలో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన
హైదరాబాద్ పరిధిలో బుధవారం మం త్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విస్తృతంగా పర్యటించారు. జియాగూడ పోలీస్ క్వార్టర్స్, మంగార్ బస్తీ బాంబే కాలనీ, నాంపల్లి రెడ్‌హిల్స్ ఖాళీ స్థలాలు, శిథిలావస్థలో ఉన్న పోలీస్ క్వార్టర్స్, మలక్‌పేట, ఫలక్‌నుమాలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, డిగ్నిటీ కాలనీల్లోని ఖాళీ స్థలాలను ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మంత్రి అజారుద్దీన్, ఎమ్మెల్యేలు మాజిద్ హుస్సేన్, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల తదితర ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను త్వరగా మ్యాపింగ్ చేసి గృహ నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. శిథిలా వస్థకు చేరిన భవనాల్లో నివసిస్తున్న కుటుంబాలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.






