19 August, 2026 | 2:44 PM

అశ్వాపురంలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

19-08-2026 12:56 PM

అశ్వాపురం, ఆగస్టు 19(విజయక్రాంతి): ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అశ్వాపురం మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూనియన్ అధ్యక్షుడు లూయిస్ ఫిలోమన్ జాతీయ జెండాను ఆవిష్కరించి, అనంతరం కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఫిలోమన్ మాట్లాడుతూ ఫోటోగ్రఫీ రంగానికి డాగురే చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన కృషి ఫలితంగా ఎంతోమంది ఫోటోగ్రాఫర్లు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షుడు తోట అశోక్ కుమార్, ట్రెజరర్ రమేష్‌తో పాటు పలువురు ఫోటో, వీడియో గ్రాఫర్లు పాల్గొన్నారు.