19 August, 2026 | 4:49 PM

చేగుంటలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ డే దినోత్సవం

19-08-2026 02:05 PM

చేగుంట,(విజయక్రాంతి): చేగుంట పట్టణంలోనీ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ వెల్ఫర్ అసోసియేషన్  ఆధ్వర్యంలో  నిర్వహించిన కార్యక్రమానికి పట్టణ  సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్ పాల్గొన్నారు,ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంను బుధవారం చేగుంట లోని గాంధీ విగ్రహం వద్ద  కెమెరా సృష్టికర్త లూయిస్- జాకాస్ - మండే డాగురె చిత్రపటానికి పూలమాలలు వేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ మాటల్లో చెప్పలేని భావాలను కాలంలో ఆగిపోయిన జ్ఞాపకాలను ఒక్క క్లిక్ తో శాశ్వతంగా నిలిపే అద్భుత కలే ఫోటోగ్రఫీ  అని తెలియజేశారు.ఈ కార్యక్రమం లొ వార్డ్ సభ్యులు ఫోటోగ్రాఫర్లు  విజయ్, నరసింహ గౌడ్, యశ్వంత్, వెంకట్ యాదవ్,తలారి లింగం, రాజు,తదితరులు పాల్గొన్నారు.