మాజీ ఎమ్మెల్యే కిశోర్ జర్నలిస్టు వీరమల్లును పరామర్శ.
19-08-2026 02:34 PM
తుంగతుర్తి,(విజయ క్రాంతి): తుంగతుర్తిమండల పరిధిలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ సాక్షి వర్ధెల్లి వీరమల్లు కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయనను బుధవారం మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, మెరుగైన వైద్య చికిత్స అందే విధంగా సలహాలు, సూచనలు, కుటుంబ సభ్యులకు ధైర్యం ఇచ్చారు. ఆయన వెంట జిల్లా నాయకులు కలెట్లపల్లి శోభన్ బాబు, సర్పంచ్ రమేష్, ఉప సర్పంచ్ నాగరాజు, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు గుండగాని రాములు, మాజీ వైస్ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, రజాక్, శ్రీరాంరెడ్డి, గోపగాని శ్రీను, రాము, సహచర జర్నలిస్టులు, గ్రామస్తులు పాల్గొన్నారు






