19 August, 2026 | 3:41 PM

మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం ఖాళీ బిందెలతో నిరసన

19-08-2026 02:39 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మిషన్ భగీరథ పైప్ లైన్  వెంటనే ఇవ్వాలని 28వ వార్డు హనుమాన్ బస్తీ ప్రజలు ఖాళీ  బిందెలతో నిరసన తెలిపారు. బస్తీ ప్రజలు మాట్లాడుతూ..మిషన్ భగీరథ పైప్ లైన్ ను కేవలం వన్ టౌన్ వెనకాల గల గల్లీలో ఇవ్వకపోవడం పట్ల  ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలా వివక్ష చూపడం చాలా బాధాకరమని వాపోయారు. మా గల్లీని ఇలా చిన్నచూపు చూస్తున్నారని మహిళలు మండిపడ్డారు. గతంలో పైపులైన్ కోసం తవ్వి వదిలి పెట్టడం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు.

పైపు లైన్ కోసం ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. తాగునీటి  పైపులైను ఇవ్వలేదని, గుంతలు పూడ్చలేదని,తామే కూడుపుకున్నామని తెలిపారు. తమ  అవస్థలను ఇప్పటికైనా పట్టించుకొని  మిషన్ భగీరథ పైప్లైన్ కనెక్షన్  డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వార్డు  వాసులు పసులేటి వెంకటేష్, చేను విజయ, మాటేటి రాజ్యలక్ష్మి, మాటేటి రాధా, పసులేటి రాధ, ముదుర కోళ్ల రాజవ్వ, ముద్ర కోళ్ల లావణ్య, ఖమ్మం భూదేవి, నాగిశెట్టి రాణి, నాగిశెట్టి రమా ఇప్పకాయల రాజేశ్వరి, కలగనూరి సరిత, మాటేటి స్వరూప, పాల్గొన్నారు.