19 August, 2026 | 1:35 PM

ఎర్రుపాలెంలో ప్రపంచ ఫోటోగ్రఫీ డే వేడుకలు

19-08-2026 12:58 PM

ఎర్రుపాలెం ఆగస్టు 19 (విజయక్రాంతి): మండల కేంద్రంలో ప్రపంచ ఫోటోగ్రఫీ డే 187వ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల వీడియో అండ్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మండల కేంద్రంలో జండా ఆవిష్కరణ, వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మునగలూరి మురళీధర్ , ఎరుపాలెం మండల అధ్యక్షులు జింకల హరినాథ్ , గౌరవ సలహాదారులు దొడ్డ అశోక్ , మండల ఉపాధ్యక్షులు గంట దుర్గాప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి నందిగం మోహన్ రావు , ఫోటోగ్రఫీ మిత్రులందరికీ పాల్గొన్నారు.