బెల్లంపల్లిలో ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలు
బెల్లంపల్లి,(విజయక్రాంతి): ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలు బెల్లంపల్లి పట్టణంలోని ఘనంగా జరుపుకున్నారు. సింగరేణి కళావేదికలో శనివారం రాష్ట్ర కార్యదర్శి హనుమాండ్ల మధుకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మధుకర్ మాట్లాడుతూ... ఇటీవల మంచిర్యాల లో జరిగిన కళాకారుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం మంచిర్యాల జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు.
పూర్తిస్థాయి జిల్లా కమిటి నీ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ జిల్లా గౌరవ అధ్యక్షుడు మిట్ట లక్ష్మణ్, అధ్యక్షుడు చొప్పదండి కిషన్, ప్రధాన కార్యదర్శి బబ్బెర రాజేందర్, నూతన మహిళా జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షురాలు బండ శాంకరి, అధ్యక్షురాలు దుర్గం లక్ష్మి, ప్రధాన కార్యదర్శి దుర్గం భాగ్యలక్ష్మి, కమిటీ సభ్యులు, సీనియర్ కళాకారులు, జానపద కళాకారులు తదితరులు పాల్గొన్నారు.






