23 August, 2026 | 12:01 AM

జీఓను రద్దు చేయాలని కోరుతూ మందలపల్లి స్టేట్ హైవేపై రాస్తారోకో

22-08-2026 11:13 PM

కాంగ్రెస్ పోవాలి కేసీఆర్ రావాలని నినాదాలతో దద్దరిల్లిన మందలపల్లి క్రాస్ రోడ్డు

దమ్మపేట,(విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగ కాంతారావు, అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే , బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు పిలుపుతో మండల పరిధిలోని మందలపల్లి క్రాస్ రోడ్డు వద్ద, జాతీయరహదారి మీద బిఆర్ఎస్ విద్యార్థి విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో జి ఓ నంబర్ 97 ను రద్దు చేయాలని కోరుతూ రాస్తా రోకో చేసి నిరసన చేపట్టారు.

ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 97  రాష్ట్రంలోని పాలిటెక్నిక్ (డిప్లొమా) విద్యా వ్యవస్థను, కళాశాలలను 'యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ', 'శక్తి' స్కీమ్‌లో విలీనం చేయడానికి ప్రతిపాదించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. వారి పోరాటానికి బిఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతూ శనివారం రాస్తారోకో నిర్వహించడం జరిగిందన్నారు.

స్కిల్ వర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన శక్తి స్కీమ్‌ తొలగించాలంటూ నాయకులు డిమాండ్ చేసారు. ప్రభుత్వం వెంటనే జీవో97ను వెనక్కి తీసుకొని, డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు నేరుగా బీటెక్  సెకండ్ ఇయర్‌లో చేరే లేటరల్ ఎంట్రీ (ఈ సెట్ ద్వారా) అవకాశం యథావిధిగా కొనసాగించాలన్నారు. జీవో ప్రకారం మళ్లీ ఇంటర్మీడియట్ చదివి ఎంసెట్  రాయాల్సి వస్తే విద్యార్థులు మూడు సంవత్సరాల చదువు వృధా అవుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. సాంకేతిక విద్యా విభాగాన్ని ప్రత్యేకంగా ఉంచి, ప్రభుత్వమే పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని ఈ సందర్బంగా ప్రభుత్వన్ని డిమాండ్ చేసారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం నియోజకవర్గ మాజీ అధ్యక్షులు వెంపటి భరత్ కుమార్, నియోజకవర్గ యువజన విభాగ మాజీ కార్యదర్శి యార్లగడ్డ శ్రీనివాసరావు, మండల యూత్ మాజీ అధ్యక్షులు మండవ సత్య, మండల నాయకులు దారా యుగుందర్,నాయకపోడు సంఘం రాష్ట్ర నాయకులు రావుల శ్రీనివాసరావు, అల్ల జంగం,మండల మాజీ ఉపాధ్యక్షులు గాజుబోయిన యేసు బాబు, తుమ్మల లక్ష్మణరావు, సర్పంచ్ సోయ్యం సత్యవతి, ఊప సర్పంచ్ ముత్తిన రామకృష్ణ, మాజీ ఎంపీటీసీ కాసిని శ్రీను, మాజీ కో ఆప్షన్ ఎంపీటీసీ బుడే,అబ్దుల్ జిన్న, వెలుగోటి మహేష్,వార్డు సభ్యులు దారా రాము, రూప రాంబాబు,ఉయ్యాల లక్ష్మీనారాయణ,మండల ఎస్ సి సెల్ నాయకలు మద్దెల పుల్లారావు, తదితరులు పాల్గొన్నారు.