జగత్‌పల్లిలో ఘనంగా అన్న ప్రసాద వితరణ
వనపర్తి: శ్రీశ్రీశ్రీ లక్ష్మీ కొండలయ్య గట్టు దేవస్థానం, జగత్‌పల్లి గ్రామంలో రెండో శనివారం సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తున్న శ్రీ విశ్వకర్మ గాయత్రి ఆశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అశేషంగా భక్తజనం తరలివచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. కార్యక్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ అరుణ్‌కుమార్ స్వామి, ట్రస్ట్ సభ్యులతో పాటు జగత్‌పల్లి గ్రామ సర్పంచ్ పెంటన్న యాదవ్, గ్రామ ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.






