22 August, 2026 | 10:58 PM

ఏంఐఎస్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడిగా గేడేకార్ సంతోష్ కుమార్

22-08-2026 09:47 PM

ఆసిఫాబాద్(విజయక్రాంతి):  జిల్లా ఏంఐఎస్ ఉద్యోగుల సంఘం నూతన జిల్లా కమిటీని శనివారం టి జి ఎం ఎస్ పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా గేడేకార్ సంతోష్ కుమార్ (ఆసిఫాబాద్), ప్రధాన కార్యదర్శిగా ఇందారపు ప్రశాంత్ (సిర్పూర్-టి), కోశాధికారిగా కె. రాజ్‌కుమార్ (తిర్యాణి) ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా వై. అశ్విని (కెరమెరి), కె. సుమలత (బెజ్జూర్), ఆర్. సంతోష్ (సిర్పూర్-యు), పి. తుకారాం (జైనూర్), ఎ. శ్రీకాంత్ (కాగజ్‌నగర్), పి. రాజేష్ (దహెగాం), ఎ. కులాజీ (కౌటాల)లను నియమించారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు సంతోష్ కుమార్ మాట్లాడుతూ విద్యాశాఖలో MIS సిబ్బంది విద్యా కార్యక్రమాల నిర్వహణ, డేటా నిర్వహణ, ప్రభుత్వ పథకాల అమలు, పాఠశాలల పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం MIS సిబ్బంది సేవలను గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని సమావేశంలో తీర్మానించినట్లు పేర్కొన్నారు.