ట్రోఫీలు గెలవడమే నా పని
- వేరే వాళ్ల అభిప్రాయాలు అనవసరం
- టెస్టుల్లో భారత్ కుదురుకుంటోంది
- తనపై విమర్శలకు గంభీర్ కౌంటర్
కొలంబో, ఆగస్టు 22: గౌతమ్ గంభీర్ హెడ్‌కోచ్‌గా వచ్చిన తర్వాత టెస్టుల్లో భారత్ ఆటతీరు దిగజారింది. కీలక ఆటగాళ్ళ రిటై ర్మెంట్, యువ ఆటగాళ్లు ఇంకా కుదురుకోకపోవడం వంటివి దీనికి కారణాలుగా చెబుతారు. అయితే గంభీర్ టెస్టులకు కోచ్‌గా పనికి రాడన్న విమర్శలు వచ్చాయి. తాజాగా టెస్టుల్లో తన కోచింగ్ రికార్డుపై వస్తున్న వి మర్శలకు కౌంటర్ ఇచ్చాడు. టెస్ట్ క్రికెట్‌లో భారత జట్టు ఇబ్బందులు పడుతుందనే వాదనను గంభీర్ తోసిపుచ్చాడు.
ఇటీవల ఎ దురైన టెస్ట్ పరాజయాలను జట్టు పతనాని కి నిదర్శనంగా కాకుండా టీమ్ పరివర్తన దశలో భాగంగా చూడాలని తెలిపాడు. కోచ్ గా ట్రోఫీలు గెలవడమే తన పనని, ఒకరి ఇష్టాలు, అభిప్రాయాలతో తనకు పనిలేద న్నాడు. ర్యాంకింగ్స్ ముఖ్యం కాదన్నాడు. టెస్ట్‌లో టీమిండియా ఏ మాత్రం ఇబ్బంది పడటం లేదనీ, ఇంగ్లండ్ పర్యటన నుంచి మెరుగైన ప్రదర్శనే చేశామన్నాడు. హెడ్ కో చ్‌గా తన దృష్టిలో జట్టు పురోగతికి అంతిమ కొలమానమనీ చెప్పాడు.
జట్టు ట్రోఫీలు గెలవగలదా లేదా అన్నదే ముఖ్యమన్నాడు. రెండో టెస్ట్ కాంబినేషన్‌లో ఏమైనా మార్పు లు ఉంటాయా? కుల్దీప్ యాదవ్‌ను కొనసా గిస్తారా? అనే ప్రశ్నలకు గంభీర్ తనదైన శైలి లో సమాధానమిచ్చాడు. 20 వికెట్లు తీయ గల బౌలింగ్ కాంబినేషన్‌పైనే భారత తుది జట్టు ఎంపిక ఆధారపడి ఉంటుందని స్ప ష్టం చేశాడు. ఒకటి రెండు మ్యాచ్‌ల ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్లను పక్కన పెట్టకూడద న్నాడు.
క్రికెట్‌లో ఎత్తుపల్లాలు సహజమని, ఆటగాళ్లకు మరింత సమయం ఇవ్వాలని సూచించారు. గిల్, పడిక్కల్, సుతార్లపై గం భీర్ నమ్మకముంచాడు. ఇక మూడు టెస్టుల సిరీస్‌లకు గంభీర్ మద్దతు తెలిపాడు. తొలి టెస్టులో ఓడిన జట్టుకు పుంజుకునే అవకా శం మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఎక్కువగా ఉంటుందని చెప్పాడు. శ్రీలంకతో రెండు టెస్టులకే పరిమితం కావడంతో రెండో మ్యా చ్ ఫలితమే సిరీస్‌ను డిసైడ్ చేస్తుందన్నాడు.






