07-02-2026 12:00:00 AM
ఎమ్మెల్యే నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 6(విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే వి.నవీన్ యాదవ్ అన్నారు. శుక్రవారం వెంగళరావు నగర్ డివిజన్ పరిధిలోని జవహర్ నగర్ సాయిబాబా దేవాలయం వద్ద 45 లక్షల రూపాయలతో, మధుర నగర్లో 55 లక్షల రూపాయలతో చేపట్టనున్న నూతన డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న డ్రైనేజీ, తాగునీటి సరఫరా, రోడ్ల వంటి మౌలిక వసతుల సమస్యలను ప్రా ధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు.అధికారులతో నిరంతరం సమన్వ యం చేసుకుంటూ పనులను వేగవంతం చేస్తున్నామని వివరించారు.
జూబ్లీహిల్స్‌ను నగరంలోనే ఒక ఆదర్శ నియోజక వర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.అనంతరం జవహర్ నగర్ లోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఎమ్మె ల్యే, పదో తరగతి విద్యార్థులతో ముచ్చటించారు. పరీక్షల సమయంలో సమయా న్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో వివరి స్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు చదువే పునా ది అని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్య కర్తలు, జీహెచ్‌ఎంసీ,జలమండలి ఉన్నతాధికారులతో పాటు పెద్ద సంఖ్యలో కాలనీవా సులు తదితరులు పాల్గొన్నారు.