07-02-2026 12:25:10 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి) : లాభాపేక్ష లేకుండా.. కేవలం సేవా దృక్పథంతో అవతరించిన గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ) రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలను చేపడుతుందని, ఇలాంటి కార్యక్రమాలను ప్రజ ల్లోకి తీసుకెళ్లేందుకు సహకరించాలని విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజంను జీటీఏ ఫౌండర్ విశ్వేశ్వర్‌రెడ్డి కలువల కోరారు. శుక్రవారం సాయం త్రం విజయక్రాంతి దినపత్రిక కార్యాలయానికి వచ్చిన విశ్వేశ్వర్‌రెడ్డి పత్రిక చైర్మ న్ సీఎల్ రాజంను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
జీటీఏ ఏ లక్ష్యంతో ఆవిర్భవించింది.. ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతుందని చైర్మన్ అడిగి తెలుసుకున్నారు. అమెరికాకు ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం వచ్చే తెలు గు రాష్ట్రాల యువతకు ఎలాంటి సమస్య వచ్చినా అటు జీటీఏతోపాటు.. వ్యక్తిగతంగా సాయం అందిస్తున్నామని తెలిపారు.
వీసా, ఇమిగ్రేషన్, న్యాయపరమై న వివాదాలు, అమెరికాకు కొత్తగా వచ్చినప్పుడు తీసుకోవాల్సిన చట్టపరమైన జాగ్రత్తలు, వివిధ రకాల అనుమతులపై యువతకు అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. విశ్వేశ్వర్‌రెడ్డి సేవలను ఈ సందర్భంగా విజయక్రాంతి చైర్మన్ సీఎ ల్ రాజం అభినందిస్తూ.. తెలంగాణలో దేవాలయాలపై ముద్రించిన పుస్తకాన్ని బహూకరించారు. అనంతరం ఇరువురు పలు అంశాలపై చర్చించారు. తాజాగా ఎన్నికైన జీటీఏ నూతన కార్యవర్గానికి సీఎల్ రాజం అభినందనలు తెలిపారు.
జీటీఏ నూతన కార్యవర్గం
2026 సంవత్సరానికి సంబంధించి గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ) నూతన కార్యవర్గాన్ని తాజాగా ఎ న్నుకున్నారు. ఫౌండర్, అడ్వైజర్‌గా విశ్వేశ్వర్‌రెడ్డి, చైర్మన్‌గా ప్రవీణ్‌రెడ్డి కేసిరెడ్డి, ప్రెసిడెంట్‌గా బాపురెడ్డి కేతిరెడ్డి, ప్రెసిడెం ట్ ఎలెక్ట్‌గా రవీందర్ గడ్డంపల్లి, వైస్ ప్రెసిడెంట్లుగా డాక్టర్ నందిని సుంకిరెడ్డి, మల్లికార్జున్ పదుకొన, మధు న్యాలపట్ల, ప్రవీణ్ బిట్ల, ప్రవీణ్ సింగిరికొండ, జనరల్ సెక్రెటరీగా దుశాంత్‌రెడ్డి, జాయింట్ సెక్రెటరీగా హరి గక్కని, ట్రెజరర్‌గా సుధీ ర్ ముద్దసాని, జాయింట్ ట్రెజరర్‌గా వంశీ సింగిరెడ్డి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలుగా.. అమర్‌రెడ్డి, అమర్‌రెడ్డి రత్న, అరున్ కాట్పల్లి, బిందు చేడెల్ల, కోత్యా బానోత్, క్రిష్ణ కడారి, మహేష్ వేనుకదసుల, మ న్మోహన్‌రెడ్డి పోతుల, నర్సింహ దోమ, మోమన్ పెంట, ప్రవీణ్ చింత, ప్రేం చిం తపల్లి, రఘు కొడుమూరి, రాజేందర్ జానుంపల్లి, సుమ కల్వల, సురేందర్ అండెం, సుశాంత్ గౌర్నేని, విజయ్ సాదువులు ఎన్నికయ్యారు.