calender_icon.png 6 February, 2026 | 11:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నర్మేట కేజీబీవీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

06-02-2026 10:09:18 PM

ఎస్ఓపై చర్యలకు ఆదేశం

నంగునూరు: నంగునూరు మండలంలోని నర్మేట గ్రామంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని (కేజీబీవీ) జిల్లా కలెక్టర్ కె. హైమావతి శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. రాత్రి భోజన సమయంలో విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారాన్ని ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తనిఖీలో భాగంగా వంటశాలలోని అన్నం, బిర్నీస్ కూర, సాంబారు, టమాటా చట్నీ, పెరుగులను కలెక్టర్ పరిశీలించారు.

కూరలు, చట్నీ పరిమాణాన్ని స్వయంగా తూకం వేయించారు. అయితే, స్టాక్ రిజిస్టర్‌లో నమోదైన సరుకులకు, వండిన వంటకాలకు అస్సలు పొంతన లేకపోవడంతో కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.రికార్డులు సరిగా లేనందుకు పాఠశాల ఎస్ఓపై చర్యలు తీసుకోవాలని ఫోన్ ద్వారా డిఈఓను ఆదేశించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన భోజనం అందించాలని, స్టోర్ రూమ్‌లో కాలం చెల్లిన సరుకులు ఉంచరాదని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి, శారీరక దృఢత్వం కోసం పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.