07-02-2026 12:00:00 AM
గెలుపొందిన వారంలోనే పనులు..
సపరిపాలనే లక్ష్యం..
తాడ్వాయి, ఫిబ్రవరి6 ( విజయ క్రాంతి ): గ్రామాభివృద్దే లక్ష్యం... గ్రామ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనులు ప్రారంభించారు నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్. గ్రామ సర్పంచ్ గా ఎన్నికల్లో గెలుపొందాలంటే నేటి పరిస్థితుల్లో లక్షల రూపాయల ఖర్చు చేయాలి, లక్షల రూపాయల ఖర్చు చేసిన గెలుస్తామన్న గ్యారెంటీ లేదు.
కానీ ఎలాంటి ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా గ్రామ సర్పంచ్ గా గెలుపొంది గ్రామాభివృద్ధి తన లక్ష్యం అంటూ పని ప్రారంభించారు ఓ సర్పంచ్.సర్పంచ్ గా గెలిపొందిన 10 రోజుల్లోనే గ్రామంలో ని మురికి కాలువలు అశుభ్రంగా ఉన్నాయని, మురికి కాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోయిందని ఆయన గుర్తించారు. వెంటనే మురికి కాలువలను శుభ్రం చేయించారు. గ్రామంలోని ప్రధాన మురికి కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి వేశారు. ప్రధాన పెద్ద మురికి కాలువలే కాకుండా గ్రామంలోని వీధుల్లో ఉన్న చిన్న చిన్న మురికి కాలవలను సైతం శుభ్రం చేయించారు.
అదే కాకుండా గ్రామంలోని తాగునీటిని అందించే డిస్ట్రిబ్యూషన్ పైపు లైన్ లు లీకేజీ లు కావడం తో తాగునీరు కలుషితం అవుతుంది. దీన్ని గుర్తించిన సర్పంచ్ లీకేజీలకు మరమ్మతులు చేయించారు ఆయనే కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామ సర్పంచ్ పోచయ్య. తన లక్ష్యం తన విధానం గ్రామాభివృద్దే అని పేర్కొంటున్నాడు. తనకు ప్రజలు అండగా ఉండి నాకు పూర్తిస్థాయిలో మద్దతు ఇచ్చి సర్పంచ్ గా నిలబెట్టారని తెలిపారు.
నూతన గ్రామపంచాయతీకి భూమి పూజ
-గ్రామంలో గ్రామ పంచాయతీకి ప్రత్యేక భవనం లేక తీవ్ర ఇక్కట్లు ఏర్పడ్డాయి. గతంలో ఉన్న పాత గ్రామపంచా యతీ భవనాన్ని అప్పటి పాలకవర్గం నూతన గ్రామపంచాయతీ నిర్మాణం కోసం భవనాన్ని కూల్చివేశారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో గ్రామపంచాయతీ భవన నిర్మాణం జరగలేదు. పరిస్థితులు అనుకూలించకపోవడంతో పాలకవర్గం భవనాన్ని నిర్మించలేకపోయారు.
దీంతో అప్పటి నుంచి గ్రామ పంచాయతీకి ప్రత్యేక భవనం లేకపోవడంతో గ్రామపంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గం సభ్యులందరూ గ్రామపంచాయతీ భవనానికి పక్కనే ఉన్న స్థానిక డ్వాక్రా గ్రూపు మహిళా సంఘం భవనంలో గ్రామపంచాయతీ విధులు నిర్వహిస్తున్నారు.ఈ భవనం సక్రమంగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బం దులు ఏర్పడ్డాయి. అయినా తప్పేది లేక అదే భవనంలో గ్రామపంచాయతీ కార్యకలాపాలు నిర్వహించారు.
నూతన గ్రామపంచాయతీ భవనానికి నిధులు మంజూరైన అధికారుల నిర్లక్ష్యం కారణంగా నూతన భవనం నిర్మాణానికి నోచుకోలేదు. సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే గ్రామపంచాయతీకి నూతన భవనం కచ్చితంగా ఉండాలనే లక్ష్యంతో పనిచేశారు. స్థానిక నాయకులను, ఎమ్మెల్యేను కలిసి భవన నిర్మాణానికి సహకరించాలని కోరారు.ఎమ్మెల్యే కె మదన్మోహన్, అధికారుల సహకారంతో నూతన గ్రామపంచా యతీ భవనానికి భూమి పూజ నిర్వహించారు. గ్రామపంచాయతీ భవనాన్ని అన్ని సౌకర్యాలతో నిర్మించడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా సర్పంచ్ తెలిపారు.
ఎలాంటి స్వార్థం లేకుండా పనిచేస్తా..
తనకు సర్పంచ్ పదవిని గ్రామ ప్రజలు కట్టబెట్టడం దేవుడిచ్చిన వరంగా భావిస్తా ను. తనపై అపారమైన నమ్మకంతో సర్పంచ్‌గా గెలిపించినందుకు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎలాంటి స్వార్థం లేకుండా పనిచేస్తాను. అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తాను. గ్రా మంలో సిసి రోడ్ల నిర్మాణానికి, మురికి కాలువ నిర్మాణానికి కృషి చేస్తాను. ఎ లాంటి రూపాయి ఖర్చు లేకుండా ప్రజలు గెలిపించినందుకు సేవలందించి వారి రుణం తీర్చుకుంటాను.
సంకు పోచయ్య,
సర్పంచ్ నందివాడ