7 July, 2026 | 6:26 PM

Breaking News

"సర్" ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలి   •   బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వానికి ఏడాది.. రామాలయంలో ప్రత్యేక పూజలు   •   ఆదివాసి నాయకపోడ్ కులస్తులకు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు   •   ప్రభుత్వ ఉచిత విద్యను, సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరాలి   •   విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన పెద్దకాపర్తి సర్పంచ్   •   గౌలిగూడ కు వెళ్లాలా... అయితే ముక్కు మూయాల్సిందే...!   •   మృతుల కుటుంబాలకు పరామర్శ, ఆర్థిక సాయం   •   డబుల్ మర్డర్ కేసులో సంచలన తీర్పు   •   విడతల వారీగా యూరియా ఇవ్వడం సరికాదు   •   మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు   •  

సిర్గాపూర్‌లో ఘనంగా కార్మికుల దినోత్సవం

01-05-2026 03:08 PM

సిర్గాపూర్ మే 01(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం నాడు సర్పంచ్ శ్రీనివాస్ రావ్ పాటిల్ ఆధ్వర్యంలో ఘనంగా కార్మికుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య భాగంగా సర్పంచ్ శ్రీనివాస్ రావ్ పాటిల్ జెండాను ఎగురవేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ....దేశ అభివృద్ధికి కార్మికుల శ్రమే పునాది అని తెలిపారు.

ప్రతి కార్మికుడి కష్టం సమాజ పురోగతికి మార్గ దర్శకమని పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ....కార్మికులు తమ హక్కులపై అవగాహన కల్గి ఉండాలని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమం అనంతరం కార్మికులను శాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, రాజగౌడ్, హనుమకొండ కృష్ణ, జమీల్, ఖలీల్, నారాయణ, వసీమ్, గ్రామ పెద్దలు, యువకులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమం సందర్భంగా కార్మికులను సన్మానిస్తూ, వారికి శుభాకాంక్షలు తెలిపారు.