7 July, 2026 | 7:33 PM

Breaking News

డిగ్రీ ప్రవేశాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానం   •   ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన వివిధ గ్రామ సర్పంచులు   •   గట్టుదుద్దెనపల్లి సంఘం చైర్మన్ గా గంగుల రామ్ రెడ్డి   •   సర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం   •   నాగిరెడ్డిపేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీల సంఖ్య పెంచాలి   •   17వ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబైన సుల్తానాబాద్ సాయిబాబా దేవాలయం   •   ఘనంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   అనగారిన వర్గాల... అభ్యున్నతి ఎమ్మార్పీఎస్ తోనే సాధ్యం   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   ఇందిరమ్మ ఇండ్ల వద్ద కరెంటు స్తంభాలు ఏర్పాటు   •  

ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణంలో జాప్యం సహించేది లేదు

01-05-2026 03:09 PM

ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణంలో ఏళ్ల తరబడి జాప్యం సహించేది లేదని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఏళ్ల తరబడి నిర్మాణానికి నోచుకోని పశు వైద్య శాల నిర్మాణం పనులను సమీక్షించారు. దీనిలో ఎవరి నిర్లక్ష్యం ఉపేక్షించేది లేదని ఇకనైనా నిర్మాణం పనులు పూర్తి చేసి రైతులకు పశు వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని వారు అన్నారు .పనులు జాప్యం వల్ల రైతులకు వైద్య సేవలు అందకుండా పోయాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఆమె వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ షోయబ్ హుస్సేన్, కౌన్సిలర్లు గుమ్ముల ఆనంద్, బొప్పారపు సత్యవతి, నాయకులు ప్రకాష్ గౌడ్, రాజ్ కుమార్, పశు వైద్య శాఖ ఏడిఏ రామకృష్ణుడు ఉన్నారు.