7 July, 2026 | 7:14 PM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వానికి ఏడాది.. రామాలయంలో ప్రత్యేక పూజలు

07-07-2026 06:18 PM

కోదాడ,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నారపరాజు రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా కోదాడ పట్టణంలోని శ్రీరామాలయంలో మంగళవారం బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడి నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు మరింత చేరువై ప్రజాసేవలో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ఆలయంలో విశేష పూజలు చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రామచంద్రరావు నాయకత్వంలో తెలంగాణలో పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతమవుతోందని పేర్కొన్నారు. కార్యకర్తల సమన్వయంతో పార్టీని గ్రామస్థాయి వరకు విస్తరించేందుకు కృషి కొనసాగుతోందని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై మరింత చురుకుగా పనిచేస్తూ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

అనంతరం నాయకులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకొని పార్టీ విజయాలను ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎండోమెంట్ జాయింట్ కన్వీనర్ వనం సుజాత, నల్గొండ జిల్లా కో-కన్వీనర్ కర్ర జానకిరామ్ రెడ్డి, ఎండోమెంట్ సూర్యాపేట జిల్లా కన్వీనర్ బాణాల సాయి శర్మ, ఓరుగంటి కిట్టు, సూర్యాపేట జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు జనార్దన్, కోదాడ పట్టణ అధ్యక్షుడు గోదేసు లక్ష్మణ్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.