1 May, 2026 | 4:51 PM

భక్తిశ్రద్ధలతో వీరబ్రహ్మేంద్రస్వామి కళ్యాణ ఉత్సవం

01-05-2026 03:07 PM

బోత్,(విజయక్రాంతి): మండలంలోని కౌట (బి )గ్రామంలో. శుక్రవారం వీరబ్రహ్మేంద్రస్వామి కళ్యాణం మహోత్సవం ఘనంగా జరిగింది మూడు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో చివరి రోజున వీరబ్రహ్మేంద్రస్వామి కళ్యాణం భక్తి శ్రద్ధతో జరిపారు గ్రామంలోని బ్రహ్మేంద్ర స్వామి భక్తులే కాకుండా ఇతర గ్రామాల నుండి భారీ సంఖ్యలో రావడం జరిగింది. ఈ సందర్భంగా హోమ గుండాన్ని నిర్వహించారు. నాలుగు జంటల దంపతులు హోమగుండం నిర్వహణలో పాల్గొన్నారు. కార్యక్రమానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు వందలాది మంది భక్తులు బ్రహ్మేంద్రస్వామి దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ వారు నిర్వహించిన కార్యక్రమంలో దాతలు సహకరించారు కార్యక్రమం విజయవంతంగా పూర్తి కావడంతో ఆలయ కమిటీ వారిని అభినందించారు