ఇటుక బట్టిలో ట్రాక్టర్ బోల్తా.. కార్మికుడు మృతి
21-04-2026 06:14 PM
ఖమ్మం జిల్లాలో విషాదం
పెనుబల్లి,(విజయక్రాంతి): పెనుబల్లి మండలం మండాలపాడు గ్రామంలో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పయాడు. ఇటుకల తయారీ కోసం ఇటుక బట్టి యాజమాని స్వయంగా ట్రాక్టర్ తో మట్టి దమ్ము చేస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి తిరగబడింది. ఈ ప్రమాదంలో ఇటుక బట్టి యాజమాని పల్లాపు బజారు(57) మట్టిలో కూరుకుపోయి అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు మట్టిలో కూరుకుపోయిన మృతదేహాన్ని అతి కష్టంతో బయటికి తీశారు.ఈ ఘటన గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి., మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






