తాడ్వాయిలో మహిళా సంఘాల వారోత్సవాలు
తాడ్వాయి, మే, 25( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో సోమవారం మహిళా సంఘాల వారోత్సవాలు నిర్వహించారు.ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఐకెపి ప్రతినిధులు తెలిపారు. ఈరోజు నుంచి మహిళా సంఘాల వారోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఈనెల 30 వరకు ఈ వారోత్సవాలు జరుగుతాయని తెలిపారు. అన్ని గ్రామ సంఘాల్లో సమావేశాలు నిర్వహించి మహిళలు చేపట్టిన కార్యకలాపాలను సభ్యులకు వినిపించారు.
సంఘాలలో మహిళలు ఎన్ని రుణాలు తీసుకున్నారు, రుణాలను ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారు,అనే విషయాలు చర్చించడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా సంఘాలలో లేని మహిళలను సంఘాల్లో చేర్పించడం, వృద్ధుల సంఘం ఏర్పాటు, వికలాంగుల సంఘాలు ఏర్పాటు చేయాలని కోరారు. మండలంలోని దేవాయిపల్లి,చందాపూర్, కృష్ణాజివాడి, సంతాయిపేట, దేమి కలాన్,బ్రాహ్మణపల్లి, కాలోజివాడి గ్రామాల్లో వారోత్సవాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు బైరవి మంగారెడ్డి, నరేష్, రంజిత్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మల్లవ్వ, పోచయ్య, ఏపిఎం రాజు,సీసీలు మెహర్,రాజిరెడ్డి, శ్రీనివాస్, నర్సింలు, రాజయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.






