calender_icon.png 7 February, 2026 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమైక్య భవనాలతో మహిళల అభివృద్ధి

07-02-2026 12:31:09 AM

తుంగతుర్తి , ఫిబ్రవరి 6 : మహిళా సమైక్య భవనాలతో మహిళల అభివృద్ధి సాధ్యపడుతుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సామేలు అన్నారు. జిల్లాలోని నాగారం మండలం ఏటూరు గ్రామంలో గొట్టిపర్తి గ్రామంలో శ్రీ శక్తి మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళల ప్రయోజనాల దృష్ట్యా 10 లక్షల రూపాయలతో నిర్మాణ పనులు చేపట్టనున్నారు.

గ్రామంలోని మహిళలందరూ ఒకే చోట సమావేశాలు అభివృద్ధి పనులు చేసుకుంటూ కు ఈ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమంలో ఈటూర్ సర్పంచ్ ఆకుల బుచ్చిబాబు గొట్టిపర్తి గ్రామ సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న  గ్రామ ఉప సర్పంచ్ అన్నే బోయిన శ్రీకాంత్, సింగిల్ విండో డైరెక్టర్ కేతిరెడ్డి రవీందర్ రెడ్డి  మాజీ సర్పంచ్ చంద వెంకన్న  మాజీ ఎంపిటిసి కేతిరెడ్డి లతా విజయ కుమార్ రెడ్డి  టిఆర్‌ఎస్ నాయకులు తాళ్లపల్లి యాకన్న ఎన్ ఎస్ యు ఐ గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ అందే పరశురాం  పాల్గొన్నారు.