calender_icon.png 7 February, 2026 | 5:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తోడుదొంగలు

07-02-2026 12:30:41 AM

ఎంఐఎం చేతిలో కీలుబొమ్మలు

ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు

హస్తం ప్రజలను నమ్మించి నమ్మించి గొంతు కోసింది

రైతుబంధ్ ఆపేసి అన్నదాతల పొట్ట కొట్టింది

ఆమనగల్లు గడ్డపై గర్జించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

ఆమనగల్లు/షాద్‌నగర్, ఫిబ్రవరి 6(విజయక్రాంతి): రాష్ట్రంలో గతంలో కేసీఆర్ కుటుంబ పాలన సాగితే, ఇప్పుడు కాంగ్రెస్ సోనియా కుటుంబ పాలన సాగిస్తోంది. ఈ రెండు పార్టీలు ప్రజలను ముంచే ‘తోడు దొంగలు’ అని కేంద్ర గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్ర వారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్, ఆమన్‌గల్లు మున్సిపాలిటీల్లోని పలు వార్డుల్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లు, రోడ్‌షోలలో కిషన్‌రెడ్డి ప్రసంగించారు. ఆమనగల్లులో ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు.

కేసీఆర్ అరాచక పాలనకు ప్రజలు రెండేళ్ల క్రితమే చరమగీతం పాడారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో సాగుతూ ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. గద్దె ఎక్కేందుకు ప్రజలను నమ్మించి గొంతు కోశారని, నెలకు రూ.4 వేల పింఛన్ ఇస్తామని, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. రైతుబంధ్ ఆపేసి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతల పొట్ట కొట్టిందని, హామీల అమలులో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు రెండూ ఎంఐఎం కనుసన్నల్లో మెలిగే పార్టీలని, కేవలం సనాతన ధర్మం, దేశాభివృద్ధి కోసం పోరాడేది ఒక్క బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలో సగం ఎంపీ స్థానాలు గెలిపించి మాకు బలం ఇచ్చారు.

అదే ఉత్సాహంతో ఆమనగల్లులోని 15 వార్డుల్లో బీజేపీ కౌన్సిలర్లను గెలిపించండి. ఢిల్లీకి రండి.. మీ సమస్యల పరిష్కారానికి నేను బాధ్యత తీసుకుంటా’ అని ప్రజలకు భరోసా ఇచ్చారు. అంతకుముందు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పట్టణ పురవీధుల్లో తిరిగి ఓటర్లను తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారితో కలిసి కిషన్‌రెడ్డి ఎన్నికల ప్రచార రథంపై పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పర్యటించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలతో ఆమనగల్లు కాషాయమయమైంది. కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థులు హరిప్రసాద్, కండె సీతారాములమ్మ, మహేశ్, జానయ్య, సునీత, నర్సింహ, వెంకటయ్య, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ అభ్యర్థులను గెలిపించండి

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించి అభివృద్ధికి బాటవేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కోరారు. షాద్‌నగర్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లలో కిషన్‌రెడ్డి మాట్లా డుతూ.. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశా రు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేం ద్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని వివరించారు. కేంద్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు పథకాలు అమలవుతున్నాయ ని తెలిపారు. గ్రా మాల అభివృద్ధితోపాటు పట్టణాలను సుం దరీకరించేందుకు ప్రణాళికాబద్ధంగా ముం దుకు సాగుతు న్నట్లు తెలిపారు.   సమావేశాల్లో బీజేపీ నా యకులు శ్రీవర్ధన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాజు భూపాల్ పాల్గొన్నారు.