29 July, 2026 | 9:24 AM

అంబులెన్స్‌లో మహిళ ప్రసవం

29-07-2026 08:14 AM

బోధన్,జులై 29 (విజయక్రాంతి): ఎడపల్లి మండలం మంగళ్ పహాడ్ గ్రామానికి చెందిన మహిళ రెండో కాన్పు నిమిత్తం నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు అధికమయ్యాయి. దీంతో 108 అంబులెన్స్ సిబ్బంది సుఖ ప్రసవం చేయడంతో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇరువురిని క్షేమంగా నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సుఖ ప్రసవం చేసిన బోధన్ 108 సిబ్బంది ఈఎంటీ శివ, పైలట్ నరేశాను వైద్యులు, కుటుంబసభ్యులు అభినందించారు.