29 July, 2026 | 9:55 AM

దొంగతనం కేసులో మహిళా అరెస్టు

29-07-2026 09:13 AM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ బస్టాండ్ లో ఓ మహిళ బ్యాగు దొంగిలించిన కేసులో మరో మహిళను అరెస్టు చేసినట్టు పట్టణ సీఐ సమ్మయ్య తెలిపారు. శాంతినగర్ కాలనీ చెందిన సుగుణ బస్టాండ్ లో టిఫిన్ చేసి చేతులు కడుతుండగా ఓ మహిళ ఆ బ్యాగులు దొంగిలించినట్టు సిసి ఫుటేజ్ లో గుర్తించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు పరిశీలన చేసి సీసీ ఫుటేజ్ ద్వారా నిందితురాలని పట్టుకున్నట్టు తెలిపారు. బ్యాగులు పదివేల నగదు ఫోన్ ఆధార్ కార్డు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుని నిందితురాలను గుర్తించి అరెస్టు చేయడం జరిగిందని సిఐ వివరించారు.. నిందితురాలు నిర్మల్ పట్టణంలోని ఎన్.బిఆర్ ఆస్పత్రిలో ఆయాగ పనిచేస్తున్నట్టు సీఐ వివరించారు.