23 May, 2026 | 5:12 AM

108 అంబులెన్స్‌లో మహిళ ప్రసవం

23-05-2026 02:07 AM

గాంధారి, మే 22 (విజయ క్రాంతి ) : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చద్మల్ తండాకు చెందిన సంగీత అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ కు ఫోన్ చేయగా వెంటనే స్పందించిన సిబ్బంది సంగీతను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు ఎక్కువవడంతో అంబులెన్సులోనే వైద్యులు సారథి సూచన మేరకు ప్రసవం చేయగా ఆడ బిడ్డ జన్మించినట్టు  సిబ్బంది అర్జున్ తెలిపారు...

తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్టు వారు తెలిపారు.. కాగా మహిళకు ఇది రెండవ కాన్పు.. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ అంబులెన్స్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియచేశారు. ఈ.ఎం.టి అర్జున్ పైలట్ శ్రీనివాస్ ఉన్నారు..