30 August, 2026 | 1:47 AM

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

30-08-2026 12:00 AM

ప్రమాదం చూసి ఆగిన మంత్రి వాకిటి శ్రీహరి

షాద్ నగర్ ఆగస్టు 29 (విజయక్రాంతి): రోడ్డుపై జరుగుతున్న ప్రమాదం చూసి మనకెందుకులే అని వెళ్లిపోకుండా.. స్వయంగా కిందికి దిగి పరిస్థితిని పరిశీలించి, అధికారులతో మాట్లాడి తక్షణ సహాయం రాష్ట్ర మం త్రి వాకిట శ్రీహరి  అందించారు. నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధన్సింగ్ తండా సమీపంలో శనివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది.

అయితే అదే మార్గంలో ప్రయాణిస్తున్న రాష్ట్ర మంత్రి వాకిట శ్రీహరి ప్ర మాద దృశ్యాన్ని చూసి చలించిపోయి, వెం టనే తన కాన్వాయ్ను ఆపి వాహనం నుంచి కిందికి దిగి ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో మృతి చెందిన మహిళ పరిస్థితిని చూసి తీవ్రంగా స్పందించిన మంత్రి, అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.

వివరాల్లోకి వెళితే.. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన మల్లెకేడి మహేశ్వర్జీ (56), తన భార్య మల్లెకేడి అరుణా బాయి (42)తో కలిసి రాఖీ పండుగ సందర్భంగా హైదరాబాద్లోని ఖర్మాన్ఘాట్లో ఉన్న తమ పెద్ద కుమార్తె ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి తిమ్మాజిపేట వైపు ద్విచక్ర వా హనంపై వెళ్తుండగా ఉదయం సుమారు 8:50 గంటలకు ధన్సింగ్ తండా సమీపం లో ఈ ప్రమాదం జరిగింది.

NH-44పై వెను క నుంచి వస్తున్న 14 టైర్ల అశోక్ లేలాండ్ లారీ అకస్మాత్తుగా టైర్ పేలడంతో అదుపుతప్పి వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న అరుణాబాయి రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో లారీ ఆమెపై నుంచి వెళ్లడంతో తలకు తీవ్ర గాయమై, అధిక రక్తస్రావంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.

ప్ర మాదం అనంతరం లారీ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు. ప్రమాదాన్ని కళ్లారా చూసిన మంత్రి వాకిట శ్రీహరి తీ వ్రంగా చలించిపోయారు. వెంటనే పోలీసులతో మాట్లాడి ట్రాఫిక్కు అంతరాయం కల గకుండా చర్యలు తీసుకోవాలని సూచించా రు. మృతురాలి పోస్టుమార్టం, ఇతర న్యాయపరమైన ప్రక్రియలను ఆలస్యం చేయకుండా పూర్తి చేసి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి స్వగ్రామానికి తరలించేలా అధికారులను ఆదేశించారు.