30 August, 2026 | 2:13 AM

‘సాధన’లో జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపించాలి

30-08-2026 12:00 AM

సాధన సంస్థ సభ్యుడు చిక్కు రాహల్ 

ముషీరాబాద్,ఆగస్టు29(విజయక్రాంతి): సాధన స్వచ్ఛంద సంస్థలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సాధన సంస్థ సభ్యుడు చిక్కు రాహల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం హైదర్గూడ లోని ఎన్‌ఎస్‌ఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

తన తండ్రి సాధన సంస్థను స్థాపించారని, ఆయన ఇటీవల కాలం చెందారని తెలిపారు. తండ్రి మరణం అనంతరం తల్లి ఆలూరి కామేశ్వరి బోర్డు సభ్యులతో కుమ్మకై సాధన సొసైటీ కి అధ్యక్షురాలి ఎన్నికయ్యారని చెప్పారు. సంస్థ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లకుండా సంస్థను పక్కదారి పట్టిస్తూ సంస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు.

ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఆలూరి కామేశ్వరిని తొలిగించి సంస్థను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. సంస్థ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని,  అందుకే ఆడిట్ నిర్వహిస్తే అన్ని విషయాలు బహిర్గతం అవుతాయని చిక్కు రాహుల్ అన్నారు.