పెళ్లి పేరుతో సర్పంచ్ మోసం చేశాడని మహిళ ఫిర్యాదు
17-08-2026 07:36 PM
బోధన్ ఆగస్టు 17 (విజయక్రాంతి): పోతంగల్ మండలం జల్లపల్లి ఫారం సర్పంచ్ దస్తగిరిపై చర్యలు తీసుకోవాలని సోమవారం బాధిత మహిళ ఆర్డీవో ఎం విజయ కుమరికి ఫిర్యాదు చేశారు. సర్పంచ్ బెయిల్పై బయటకు వచ్చి తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని బోధన్ ఆర్డీవోకు విన్నవించారు. పెళ్లి చేసుకుంటానని తనకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడని, అనంతరం అబార్షన్ చేయించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ పదవిలో కొనసాగితే తనకు మరింత ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉందని తెలిపింది.






