రేపు ఉమ్మడి మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
17-08-2026 07:33 PM
గుండాల/ఆళ్ళపల్లి, (విజయక్రాంతి): రేపు ఉమ్మడి మండలమైన గుండాల మరియు ఆళ్ళపల్లి పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని విద్యుత్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 33kv మామకన్ను ఫీడర్ లో మరమ్మత్తులు ఉన్న నేపథ్యంలో రెండు మండలాలలో ఉ.9:00 గం నుండి మ.01:00 గం. వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని, విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించగలరని ప్రకటనలో పేర్కొన్నారు.






