పెద్దమల్లారెడ్డి చెరువులో మహిళ మృతదేహం లభ్యం
25-04-2026 09:54 AM
భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామ చెరువులో శనివారం మహిళ మృతదేహం లభ్యమైంది. అటుగా వెళ్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ కొండల్ రెడ్డి చెరువులో మృతదేహం తేలుతూ కనిపించడంతో వెంటనే గ్రామ పాలకవర్గానికి, పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల వివరాల ప్రకారం మృతురాలు పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన దూడ ఎల్లవ్వ (55)గా గుర్తించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతి కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






