భార్యను చంపి భర్త ఆత్మహత్య!
25-04-2026 12:52 AM
సదాశివపేట, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి, ఆపై తానూ ప్రాణాలు తీసుకున్నాడు. భార్యపై అనుమానంతో భర్త ఆమెతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన అతను రోకలి బండతో రాణి (40) తలపై బాదాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. భార్య మరణించిందని నిర్ధారించుకున్న భర్త రాజు(43), తర్వాతి కొద్దిసేపటికే మనోవేదనతో ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.






