25 April, 2026 | 4:27 AM

చర్చలు సక్సెస్

25-04-2026 02:36 AM

ఆర్టీసీ విలీనం

11%  పీఆర్సీ, కార్మిక సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

  1. విలీనానికి అధికారులు, కార్మిక నాయకులతో కమిటీ
  2. మిగతా సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ యాజమాన్యానికి డిప్యూటీ సీఎం ఆదేశం 
  3. విధుల్లో చేరాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న పిలుపు.. నేటి నుంచి రోడ్డెక్కనున్న బస్సులు
  4. నేడు అన్ని డిపోల్లో సంబురాలకు ఆర్టీసీ జేఏసీ పిలుపు

హైదరాబాద్ ఏప్రిల్ 24 (విజయక్రాంతి): ఆర్టీసీ జేఏసీతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రుల బృందం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. శుక్రవా రం అర్ధరాత్రి వరకు సుమారు 12 గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రు లు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూ రి లక్ష్మణ్, వివేక్.. ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు జరిపారు. ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రధానంగా మూడు డిమాండ్లయిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, పీఆ ర్సీ ప్రకటించడం, కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించడంపై పట్టుబట్టారు.

మంత్రులు కూడా 32 డిమాండ్ల లో 29 అంగీకరించి, ఈ మూడు డిమాండ్లకు సమయం కోరారు. కానీ, ఈ మూడు డిమాండ్లను పరిష్కరించాల్సిందేనని జేఏ సీ నేతలు పట్టుబట్టడంతో ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చి వాటిని కూడా అంగీకరించడంతో చివరకు చర్చలు సఫల మయ్యాయి. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఆర్టీసీ జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడారు.

11 శాతం పీఆర్సీ: డిప్యూటీ సీఎం

11 శాతంతో పీఆర్సీ ఇచ్చేందుకు నిర్ణయించినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు, ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసేందుకు అధికారులు, కార్మిక నాయకులతో కలిపి కమిటీ వేస్తున్నట్టు ప్రకటించారు. ఆర్టీసీ కార్మిక సంఘాలకు గుర్తిం పు ఎన్నికలను నిర్వహించడాన్ని ప్రభుత్వం అంగీకరించినట్టు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించారు. మిగిలిన అంశాలను కూడా ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక నాయకులు కూర్చుని పరిష్కరించుకోవాలని ఆర్టీసీ యాజమాన్యానికి సూచిం చారు. ఆర్టీసీ సంస్థ మనదని, ఆర్టీసీ కార్మికులు మన కుటుంబసభ్యులని పేర్కొన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ జేఏసీ నేతలతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి అని తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి బస్సులు యథావిధి గా నడవాలని అటు అధికారులకు, ఇటు కార్మికులందరూ విధుల్లో చేరాలని సూచించారు. ఈ అవకాశాన్ని చాలామంది తమకు అనుకూలంగా మలుచుకొని శవరాజకీయాలకు పాల్పడ్డారని విమర్శించారు. అందరూ కలిసి ప్రయాణికులకు మెరుగైన సేవలు అం దించాలని కార్మికులకు కోరారు.

ప్రభుత్వానికి ధన్యవాదాలు: ఆర్టీసీ జేఏసీ

కొన్నేండ్లుగా పెండింగ్‌లో ఉన్న అంశాల ను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో అంగీకరించినందుకు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న ధన్యవాదా లు తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంశం ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని, దీనిపట్ల ప్రభుత్వం అనుకూల నిర్ణయం తీసుకు న్నందుకు కార్మికుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. గత అమరుల ఆకాంక్షలను, కార్మికుల కలలు సహకారం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం, 11శాతంతో పీఆర్సీ ప్రక టించినందుకు ధన్యవాదాలు అని వెల్లడించారు.

మిగతా సమస్యలను కూడా పరిష్కరి స్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. అలాగే గత ప్రభుత్వంలో సమ్మె కాలంలో నమోదు చేసిన కేసులు అన్నీ ఎత్తివేయాలని కోరడంతో దానికి ప్రభుత్వం అంగీకరించిందన్నారు. కార్మికులందరూ విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. కార్మిక సంఘ నేత అశ్వద్ధామరెడ్డి, థామస్‌రెడ్డి మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సంద ర్భంగా శనివారం అన్ని డిపోల్లో సంబురా లు నిర్వహించాలని ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది.